శంషాబాద్ రూరల్, జూన్ 27: పూజల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచుకొని ఆమెరికాకు పారిపోయిన నకిలీ పూజారి చామర్తి రామలచ్చారావును శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం..
బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో పూజల పేరుతో రామలచ్చారావు ప్రజల నుంచి భారీగా డబ్బులు తీసుకొని పూజలు చేయకుండానే ఆమెరికాకు పారిపోయాడు. ఆమెరికా వెళ్లిన పూజారి అక్కడా మోసాలు చేయడంతో గుడి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో రామలచ్చారావు ఇండియా వచ్చాడు. అతడికోసమే మాటు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.