హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 7: ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు గురువారం ఆయన తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.