నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు : మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని మంత్రి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక కేసీఆర్ పదవులను తృణప్రాయంగా వదిలేసి పోరుబాట పట్టిన యోధుడని మంత్రి కొప్పులఈశ్వర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహోద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ అని కొప్పుల కొనియాడారు.
తాను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజు చారిత్రాత్మకమైందన్నారు. కేసీఆర్ తాను సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

