హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 1000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. అక్టోబర్ 8న ఉదయం 8గంటల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది.
అదేనెల 28 దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించినట్టు తెలిపింది. వివరాలకు www.tgprb.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.