KTR | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కుంటుపడిన విద్యావ్యవస్థ: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదని మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదని మండిపడ్డారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని దుయ్యబట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదని చెప్పారు.
అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతుబీమా, ప్రాజెక్టులు పడావు పడ్డాయని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి
రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు
విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది
వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు
విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు
వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు
పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం… pic.twitter.com/PxNAGvvlCi
— KTR (@KTRBRS) June 13, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

