ఆరు నెలలుగా అణా పైసా ఇయ్యలె!.. సర్పంచ్ల ఆకలి కేకలు.. కాంగ్రెస్ సరార్ మొండిచేయి
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో గ్రామాలను నడిపించే సర్పంచ్ల పొట్ట కొడుతున్నది. కొత్త సర్పంచ్‌లు కొలువుదీరి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవ వేతనంలో అణాపైసా కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నది.
- ఊరి ప్రథమ పౌరులకు 6 నెలలుగా రాని గౌరవ వేతనం
- ఒకొక గ్రామ సర్పంచ్‌కు రూ.39,000 బకాయిలు
- పాత పనుల బిల్లులు గాలికి.. కొత్త జీతాలు ఇవ్వని దుస్థితి
- 49.53 కోట్ల వేతనాలను తొకిపెట్టిన రేవంత్ ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో గ్రామాలను నడిపించే సర్పంచ్ల పొట్ట కొడుతున్నది. కొత్త సర్పంచ్‌లు కొలువుదీరి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవ వేతనంలో అణాపైసా కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నది. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు.. గ్రామాల్లోని ప్రథమ పౌరులకు ఇచ్చే అరకొర గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వలేక చేతులెత్తేయడం రాష్ట్ర ఆర్థిక దివాలాకోరుతనానికి అద్దం పడుతున్నది. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించిన రూ.531 కోట్ల పెండింగ్ బిల్లుల పరిస్థితి ఇప్పటికే గాలిలో దీపంలా మారింది. నిరుడు డిసెంబర్ 22న 12,702 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరితే. నేటికీ కనీస గౌరవం ద కడం లేదు. నెలకు రూ.6,500 గౌరవ వేతనం ఇవ్వలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ఖజానా ఉన్నాదా? నిలదీస్తున్నారు.
పాత బిల్లులు నిల్.. కొత్త జీతాలు సున్నా
గత ప్రభుత్వ హయాంలో (2019-2024) సర్పంచ్‌లుగా పనిచేసిన వారు సొంత ఆస్తులు అమ్ముకొని, అప్పులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి వెచ్చించిన బిల్లుల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉన్నది. తమకు న్యా యం జరుగుతుందని ఆశించిన వారిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. పోనీ, కొత్తగా వచ్చిన వారికైనా గౌరవంగా వేతనాలు ఇస్తున్నారా? అంటే అదీ లేదు. దాదాపు రూ.49.53 కోట్ల వేతనాలను ప్రభుత్వం తొకిపెట్టింది. గ్రామాల్లో పనులు చేయాలంటే నిధులు లేవు, కనీసం జేబు ఖర్చులకు గౌరవ వేతనమూ లేదు. ఆరు గ్యారెంటీలు అంటూ వేల కోట్లు కుమ్మరిస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్‌రెడ్డి సరార్.. కేవలం రూ.49.53 కోట్లు సర్పంచ్ల వేతనాల కోసం విడుదల చేయలేకపోవడం వారి చిత్తశుద్ధిని శంకిస్తున్నది. ఇప్పటికైనా తమ గౌరవ వేతనం తక్షణమే విడుదల చేయాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచ్ల గౌరవ వేతనం బకాయి ఇలా..
రాష్ట్రంలో మొత్తం గ్రామాలు: 12,760
కొత్త సర్పంచ్‌లు ఉన్న గ్రామాలు : 12,702
ఒకో సర్పంచ్ నెలవారీ వేతనం : రూ. 6,500
ఆరు నెలల మొత్తం బకాయిలు : రూ. 39,000
ప్రభుత్వం ఇవ్వాల్సింది నెలవారీగా : రూ.8.25 కోట్లు
ఆరు నెలల బకాయి భారం : రూ.49,53,78,000
అణాపైసా గౌరవ వేతనం కూడా అందలేదు
సర్పంచ్ అయ్యావ ని ఊరంతా దండాలు వేశారు.. శాలువాలు కప్పారు. ఊరికి మొట్టమొదటి పౌరుడినని అందరూ గౌరవించా రు. కానీ, ఆ గౌరవం నా కడుపు నింపడం లేదు. కొత్తగా సర్పంచ్ బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు కావస్తున్నది. నెలకు ఇచ్చేదే 6,500 అ రకొర జీతం.. దానిని కూడా ఆరు నెలలుగా ఇవ్వకుండా ప్రభుత్వం తొకిపెడితే, ఎలా బతకాలి?.
-బెల్లి సుధాకర్, అయిటిపాముల సర్పంచ్, కట్టంగూర్ మండలం, నల్లగొండ జిల్లా
ఆకలితో అలమటించేలా చేయకండి
గ్రామ సర్పంచ్ అయిన నేను ఉదయం లేచింది మొదలు రాత్రి ప డుకునే వరకు ఊరి సమస్యల చుట్టూ తిరగాలి. గ్రామంలో చిన్న డ్రైనేజీ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తారు. చేతిలో పైసల్లేక, జేబు ఖర్చులకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నం. గ్రామ పెద్దలుగా ఉన్న మముల్ని ఆకలితో ఆలమటించేలా చేయకండి.
-తగుళ్ల శ్రీను, సర్వారం సర్పంచ్, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

