Seethakka | సంక్రాంతికి చీరలేవి సీతక్కా? సీఎం రేవంత్, మంత్రి సీతక్క చెప్పిన మాటలు మభ్యపెట్టే హామీలేనా..!
Seethakka | స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగకు మంచి డిజైన్లతో మన్నికైన రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సర్కారు మాట తప్పిందని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
- బతుకమ్మ చీరల పథకం రద్దు చేసిన ప్రభుత్వం
- ఎస్‌హెచ్‌జీ మహిళలకు రెండు చీరలిస్తామని హామీ
- వేదికలపై సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు
- పండుగ వచ్చినా చీరల పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం
Seethakka | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగకు మంచి డిజైన్లతో మన్నికైన రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సర్కారు మాట తప్పిందని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది. కానీ చీరల పంపిణీ ముచ్చట ఏమైందో ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు. కనీసం నేతకార్మికులకు ఆర్డర్లు ఇవ్వలేదు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క చెప్పిన మాటలు మభ్యపెట్టే హామీలే అయ్యాయని ఎస్‌హెచ్‌జీ మహిళలు మండిపడుతున్నారు.
ఆర్డర్లపై సర్కారు అలక్ష్యం
కోటికి పైగా చీరల కోసం 450 కోట్లు అవసరమని, తయారీకి 4 నెలలకు పైగా సమ యం పడుతుందని నేతకార్మికులు చెబుతున్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరల తయారీ కోసం దసరాకు 6 నెలల ముందే నేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చి, 350 కోట్లు మంజూరు చేసే ది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీని రద్దు చేసింది. సంక్రాంతికి రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పింది.
గత డిసెంబర్ 19న మహిళా సంఘాల నాయకులను పిలిచి డిజైన్లను ఎంపిక చేసినట్టు చెప్పింది. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు, తయారీ కోసం ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం సంక్రాంతికి చీరలు పంపిణీ చేస్తుందని మహిళలు, తయారీకి ఆర్డర్లు ఇస్తే ఉపాధి లభిస్తుందని నేత కార్మికులు ఆశించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలపై ఆశపెట్టుకున్నందుకు నిరాశే మిగిలిందని నిట్టూరుస్తున్నారు.
రంగురంగుల చీరలిస్తాం
గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకునేంతా నాణ్యతతో లేవు. వాటి మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నరు. మంచి డిజైన్లతో ఒక్కొక్కరికీ రెండు చీరల చొప్పున 1.3 కోట్ల చీరలు ఆర్డర్ చేస్తం. త్వరలోనే మహిళలందరికీ మన్నికైన చీరలు పంపిణీ చేస్తం.
– 2024 సెప్టెంబర్ 9న హైదరాబాద్ లలితాకళాతోరణంలో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ
ఆర్డర్లిచ్చుడే ఆలస్యం
బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వలేకపోయాం. వచ్చే సంక్రాంతికి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో పాటు మహిళా సంఘాల్లోని 63 లక్షల మంది సభ్యులకు రెండు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తాం. ఇందుకు డిజైన్లను ఎంపిక చేసి వెంటనే ఆర్డర్లిస్తాం.
– 2024 నవంబర్ 4న అంగన్వాడీలు, హెల్పర్ల మీటింగ్‌లో సీతక్క హామీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

