Irrigation Projects | ప్రాజెక్టుల నిర్వహణ గాలికి.. పంపింగ్ స్టేషన్లపై చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
- సీజన్ మొదలైనా ఓఅండ్‌ఎంకు నిధులు నిల్
- పూర్తికాని మరమ్మతులు.. ముగిసిన అగ్రిమెంట్లు..
- పంపింగ్ స్టేషన్లపై చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు
- ఎత్తిపోతలు ఎట్లా?: అధికారుల మల్లగుల్లాలు
- బడ్జెట్లోనే రూ.145కోట్ల కేటాయింపు
- రూపాయి విదిల్చని కాంగ్రెస్ సర్కారు
Irrigation Projects | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిచోట్ల వాటి నిర్వహణ ఏజెన్సీల అగ్రిమెంట్లు పూర్తికాగా, మరికొన్ని చోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆపరేటింగ్‌కు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సీజన్లో నీటిని ఎత్తిపోయకుండా సాగునీరిచ్చేదెట్లా? అని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు సంబంధించిన బిల్లులు విడుదల చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నది.
ఓఅండ్ఎంపై నిర్లక్ష్యం
రాష్ట్రంలో ప్రాజెక్టులు, పంప్‌హౌస్‌ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇరిగేషన్‌శాఖలో ఓఅండ్ఎం విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులు, పంప్‌లు, కాల్వలు, తూముల నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణ ఈ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. చిన్న మరమ్మతులు, అత్యవసర పనులకు ఈఎన్సీల అనుమతి లేకుండానే ఈఈ, డీఈల స్థాయిలోనే నిధులు కేటాయింపునకు అవకాశం కల్పించారు. రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఎస్ఈ, 50లక్షల నుంచి కోటి వరకు చీఫ్ ఇంజినీర్ స్థాయి, కోటికి మించి ఖర్చయ్యే పనులను స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేలా నిబంధనలు సడలించారు.
నిర్వహణ, మరమ్మతుల్లో ఎక్కడా జాప్యం కావద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, పంప్‌హౌసుల్లో మరమ్మతులు, నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు పూర్తిచేస్తూ వస్తున్నారు. కానీ ఆరునెలలుగా ఓఅండ్ఎం పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఓఅండ్ఎం కోసం రూ.145కోట్లు కేటాయించింది. మొదటి త్రైమాసికం ముగిసినా రూపాయి కూడా విడుదల చేయలేదు.
బిల్లులు రాక టెండర్లలో జాప్యం
సాధారణంగా సాగునీటి ఎత్తిపోతల పథకాలు ఏడాదిలో 90నుంచి గరిష్ఠంగా180 రోజుల వరకే పనిచేస్తాయి. వరద ప్రవాహాలున్నప్పుడే ఎత్తిపోతలు సాధ్యమవుతాయి. వీటిని ప్రైవేట్ ఏజెన్సీలే నిర్వహిస్తున్నాయి. 2021లో టెండర్ల ద్వారా ప్రభుత్వం ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కల్వకుర్తిలోని 4పంపింగ్ స్టేషన్లు, రాజీవ్భీమాలోని 4, నెట్టెంపాడులోని 3, దేవాదులలోని 9, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్ప, చౌటుపల్లి హన్మంతరెడ్డి తదితర పంపింగ్ స్టేషన్ల అగ్రిమెంట్లు ముగిశాయి. మళ్లీ టెండర్లు పిలిచి బాధ్యతలు అప్పగిస్తేనే పంప్‌హౌస్‌లు నడిచే దుస్థితి నెలకొన్నది. ఓఅండ్ఎం బిల్లులు మంజూరు కాకపోవడంతో టెండర్ల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతమున్న ఏజెన్సీలతో తాత్కాలికంగా నడిపిద్దామని భావిస్తున్నా కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా ఓఅండ్ఎంను నిర్వహించలేమని అధికారులు తేల్చిచెబుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

