ఎల్లూరు రిజర్వాయర్‌కు నీళ్లు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు సాగునీరు రావడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము, తాను నాడు కేసీఆర్‌ను కోరి పెట్టించడం వల్లే ఏర్పాటయిందని గుర్తుచేశారు. ఈ పథకానికి సంబంధించి సాగునీటి అంశాలపై మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
- నాటి బీఆర్ఎస్ చర్యల ఫలితమే నేటి జలకళ
- మూడేండ్ల నుంచి పాలమూరు పనులు ఆపిందెవరు?
- మంత్రి జూపల్లి సవాల్‌కు సిద్ధం
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు సాగునీరు రావడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము, తాను నాడు కేసీఆర్‌ను కోరి పెట్టించడం వల్లే ఏర్పాటయిందని గుర్తుచేశారు. ఈ పథకానికి సంబంధించి సాగునీటి అంశాలపై మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సరిదిద్దిందని పేరొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో పుషలంగా నీరు ఉన్నందున, ప్రభుత్వం ప్యాకేజీ 3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగించి వెంటనే నీటిని పారించాలని డిమాండ్ చేశారు. ప్రతి రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నింపే వీలుందని, మిగిలిన పనులను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పాలమూరు – రంగారెడ్డి పనులను ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నదని, గతంలో ఇచ్చిన కాలువల టెండర్లను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

