హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 449 మంది బాధితులు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,53,626కు చేరింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 6,42,865కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,912 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,849కి పెరిగిందని పేర్కొ్ంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 91,350 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.