శిశువు తొడలో ఇరుక్కున్న సూది తొలగింపు.. నెలరోజుల నరకయాతనకు తెర
మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువుకు టీకా వేసే క్రమంలో ఇంజెక్షన్ తొడలో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించని అక్కడి సిబ్బంది వారిని ఇంటికి పంపించగా.. నెలరోజులు శిశువు నరకయాతన అనుభవించింది. వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లాకు చెందిన వెంకటరమణ భార్య అక్షిత డెలివరీ కోసం జూలై 19న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరింది.
- సర్కార్ దవాఖానలో ఘటన.. కాదంటున్న వైద్యులు
మహబూబ్నగర్, ఆగస్టు 24 : మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువుకు టీకా వేసే క్రమంలో ఇంజెక్షన్ తొడలో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించని అక్కడి సిబ్బంది వారిని ఇంటికి పంపించగా.. నెలరోజులు శిశువు నరకయాతన అనుభవించింది. వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లాకు చెందిన వెంకటరమణ భార్య అక్షిత డెలివరీ కోసం జూలై 19న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరింది. 20వ తేదీన అక్షిత శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత వారం రోజులపాటు దవాఖానలోని ఎన్ఐసీయూలో ఉంచారు. టీకా వేసే క్రమంలో చిన్నారి తొడలో సూది ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. తొడ భాగం వాపు రావడంతో అనుమానంతో తల్లిదండ్రులు డాక్టర్లను సంప్రదించగా.. టీకా వేశామని.. కొద్దిరోజుల తర్వాత వాపు తగ్గిపోతుందని చెప్పి డిశ్చార్జి చేశారు.
ఆ తరువాత వారం, పదిరోజులు దాటినా వాపు తగ్గకపోగా నొప్పితో శిశువు ఏడ్వడం ఎక్కువైంది. దీంతో శిశువును కోస్గి పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా.. అక్కడ స్కానింగ్ తీయగా.. తొడలో సూది ఉన్నట్టు అక్కడి వైద్యులు గుర్తించారు. ఈ నెల 22న మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చి వైద్యులను కలువగా ఆపరేషన్ తొలగిస్తామని చెప్పారు. సోమవారం ఆపరేషన్ చేసి శిశువు కాలి తొడలోంచి 2 ఎంఎం సూదిని డాక్టర్లు తొలగించారు. ఈ ఘటనపై దవాఖాన సూపరింటెండెంట్ అజ్మీరా మాట్లాడుతూ.. శిశువు తొడలో ఉన్నది 2 ఎంఎం సూది అని.. తమ వైద్యశాలలో శిశువులకు కేవలం 0.5 ఎంఎం సూది మాత్రమే వేస్తామని తెలిపారు. ఒక వేళ బయట ఎక్కడైనా ప్రైవేట్ దవాఖానలో తీసుకున్నారా? అన్న విషయమై విచారణ జరిపిస్తామని, ఒకవేళ తమ వద్ద జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

