నిందితుడిని పోలీసులే తప్పించారు!
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది.
- బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో కొత్త మలుపు
- బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్ అరెస్టు
- పంజాగుట్ట సీఐ అరెస్టుకు సైతం చర్యలు?
ఖైరతాబాద్, జనవరి 28: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది. గతనెల 24న తేదీ తెల్లవారుజామున షకీల్ కొడుకు నడిపిన కారు బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన ఘటన కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాహిల్ అమీర్‌ను తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులు, తండ్రి, మామ, అతడి బావమరిది, ఇంట్లో పనిచేసే వారు, అనుచరులు ఇలా పది మంది వరకు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది.
ఇప్పటికే పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేయగా, బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్ కీలక భూమిక పోషించినట్టు వెల్లడైంది. ప్రేమ్‌కుమార్‌తోపాటు అతడితో బేరం కుదిర్చిన మరో వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. మరింత లోతైన దర్యాప్తు కోసం వారిని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. రాహిల్ గతనెల దుబాయికి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం లుకౌట్ నోటీసు సైతం జారీ చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేయగా, మొత్తం పది మందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాహిల్‌ను తప్పించేందుకు ఇద్దరు సీఐల మధ్య ఫోన్ సంభాషణలు, బేరసారాలు కూడా జరిగినట్టు సమాచారం. బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేయగా, సీఐ దుర్గారావు అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రత్యేక బృందాలు ఆ పనిలో ఉన్నట్టు సమాచారం. రాహిల్ అమీర్ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఉన్నతాధికారులు డిపార్ట్మెంట్లోని మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొందరి కాల్ డాటాలను సైతం సేకరిస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

