హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కొత్తగా నారొటిక్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది సుమారు 15-20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యువత పాలిట శాపంగా మారుతున్న డ్రగ్స్‌ను అరికట్టడానికి, ఎక్కువ మందిని పరీక్షించేందుకు ఈ బృందం కృషిచేస్తుందని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్‌లో చురుకుగ్గా పనిచేస్తున్న, నైపుణ్యం కలిగిన వారితో ఈ స్పెల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బృంద ంలో సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తంగా 15-20 మంది సిబ్బంది ఉండనున్నారు. వీరికి టీజీన్యాబ్తో కలిపి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ స్పెషల్ నారొటిక్ టీమ్‌ను డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో డ్రగ్స్ వినియోగం పెరగడంతో, వాటి మూలాలను నిర్మూలించేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.