వరంగల్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పత్తికి రికార్డు ధర పలుకుతున్నది. మంగళవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ ధర రూ.8,010 పలికింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి క్వింటాల్‌కు రూ.6,380 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఈసారి పత్తికి మంచి ధర వస్తున్నది. గతేడాది ఇదే సీజన్లో క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.7,480 పలికింది.