హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. మే 4న జాతీయంగా నీట్-యూజీ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ‘కీ’తోపాటు ఫలితాలను శనివారం వెల్లడించే అవకాశాలున్నట్టు సమాచారం.
16న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 16న విడుదలకానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 4.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.