హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగా ణ): ఎంబీబీఎస్, బీడీఎస్‌లో 2026-27లో ప్రవేశాల కోసం నీట్ యూజీ -2026లో అ భ్యర్థుల ర్యాంకులను కాళోజీ వర్సిటీ శనివా రం విడుదల చేసింది. అ భ్యర్థులు తమ ర్యాం కుల జాబితాను knruhs.telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చని సూచించింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోటిఫి కేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నీట్ యూ జీలో 13వ ర్యాంకు సాధించిన వీరయ్యగారి సహ్యుకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాగా, 19వ ర్యా ంకు వచ్చిన బూర సాయి చరణ్‌కు స్టేట్ సెకం డ్ ర్యాంక్ వచ్చింది. 21వ ర్యాంకు సాధించిన కే హనీశ్ స్టేట్ మూడో ర్యాంకు, 38వ ర్యాంకు సాధించిన ఏ సాయి చరణ్‌రెడ్డి స్టేట్ నాలుగో ర్యాంకు, 42వ ర్యాంకు సాధించిన మయూక్ జయసింహ స్టేట్ ఐదో ర్యాంకు సాధించారు.