హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ)/ ములుగు: తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజకు అరుదైన గౌరవం లభించింది. ఏపీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ (ఐఐవోపీఆర్) అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ఉద్యాన విజ్ఞాన డివిజన్ మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసిం ది. మూడేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నా రు. నీరజ మాట్లాడుతూ రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే ఐఐవోపీఆర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవి దక్కడం సంతోషంగా ఉన్నదన్నారు.