హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కాలుక్యులేటర్ను తయారు చేసిన హైదరాబాద్కు చెందిన నీలకంఠ భానుకు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ మ్యాగైజన్ ఫోర్బ్స్ విడుదల చేసిన 30 ఏండ్లలోపు 30 మంది జాబితాలో ఆయనకు చోటు లభించినట్లు ప్రకటించింది. ఈ ఫోర్బ్స్ జాబితాలో భాంజు ఫౌండర్స్ నీలకంఠ భాను, అల్లూరి ఉదయ్ కిరణ్, జొన్నలగడ్డ సాయి కృష్ణకాంత్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో భానుకు చోటు దక్కడం ఇది రెండోసారి కావడం విశేషం.