Telangana | భువనగిరి గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. కేంద్రం సీరియస్
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందం సందర్శించనుంది.
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందం సందర్శించనుంది. అలాగే ఫుడ్‌పాయిజన్‌కు గురైన బాధిత విద్యార్థులతో పాటు.. ఈ ఘటనలో మరణించిన ప్రశాంత్ కుటుంబ సభ్యులను కలవనుంది. అనంతరం ఈ ఘటనపై కేంద్రానికి నివేదిక అందించనుంది.
భువనగిరి గురుకుల హాస్టల్లోని విద్యార్థులకు గత శుక్రవారం రాత్రి మజ్జిగతో పాటు కిచిడీ అందించారు. అయితే వాటిని తిన్న తర్వాత 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది.. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రశాంత్ అనే విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ప్రశాంత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

