పంటల సేకరణలో జాతీయ విధానం తేవాలి : కేకే
k keshava rao | పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని

న్యూఢిల్లీ : పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో రెండు పంటలు పండుతాయి. రబీలో పండే వరి పంట వాతావరణ పరిస్థితుల వల్ల బాయిల్డ్ రైస్‌గా చేసి కేంద్రానికి ఇస్తున్నాం.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నీరు, విద్యుత్, పెట్టుబడి సాయం ఇస్తూ ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట ఉత్పత్తి సామర్థ్యం పెంచాం. 62 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది. ధాన్యం తీసుకోవాలని చెప్తుంటే మీరు ఇంత ధాన్యం ఎలా పండిస్తారు? అని కేంద్రం అంటుంది. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం ఇది. పంటల సేకరణలో జాతీయ విధానం తేవాలి. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలి.
కోటి టన్నుల ధాన్యం సేకరించాలి
ఎంఓయూ ప్రకారం.. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం అంటుంది. తెలంగాణ నుంచి కోటి టన్నులు ధాన్యం ఇస్తాం తీసుకోండి.. ఇది దేశానికే ప్రయోజనం. మొత్తం కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాలి. 80, 85 లక్షల టన్నులు అంటూ కేంద్ర మంత్రి బేరం ఆడుతున్నాడు. కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తాం. రెండు మూడేళ్ల సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్లుతారు. అంతవరకు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణతో ఒకలా.. పంజాబ్‌తో ఒకలా వ్యవహరిస్తున్నది
రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపకూదన్నారు. పంజాబ్ పట్ల ఒకలా.. తెలంగాణా పట్ల ఒకలా కేంద్రం వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. పంటల సేకరణలో కేంద్రం జాతీయ విధానం తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్ర నాలుగు డిమాండ్లు నెరవేర్చాలి. పార్లమెంట్లో గందరగోళం సృష్టించే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం చర్చ చేపట్టాలని కోరుతున్నాం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

