హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల్లో రాజీ కోసం ఈ నెల 16న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(టీఎస్ ఎల్ ఎస్ ఏ) సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు, తాలూకా కోర్టుల్లోనూ ఈ లోక్ అదాలత్ ఫిజికల్‌గా, ఆన్లైన్లో నిర్వహిస్తామని వివరించారు.