హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దళితబంధు అద్భుతంగా అమలవుతున్నదని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల అమలు కోసం బ్యూరోక్రాట్లతో కలిసిపనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను చేరుకొంటామని చెప్పారు. అమెరికాలోని నేషనల్ మైనారిటీ సప్లయర్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఎంఎస్డీసీ) ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌కు చైర్మన్ యింగ్ మాక్గ్యురే ఆహ్వానం మేరకు డిక్కీ వ్యవస్థాపక చైర్మన్ మిలింద్ కాంబ్లితో కలిసి రవికుమార్ హాజరయ్యారు. ‘ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సప్లయర్ డైవర్సిటీ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో దళితబంధు పథకాన్ని రవికుమార్ ప్రస్తావించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాన్ని మానిటరింగ్ చేయడంలో డిక్కీ కీలకపాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌కు అమెరికా వాణిజ్య అధికారులతోపాటు చైనా, బ్రెజిల్, ఇండియా, యూకే, దక్షిణాఫ్రికా ప్రతినిధులు, బ్లాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు హాజరయ్యారు.