హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25వంటి 10లోపు 1, 25లోపు 8, 100లోపు 27 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ, శ్రీమతి రమానారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో తమ్మిన గిరీశ్ 10వ ర్యాంకు కైవసం చేసుకొన్నారని పేర్కొన్నారు.
వెయ్యిలోపు 174 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించినట్టు వెల్లడించారు. ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 1,1,6,7,9,10 వంటి 10లోపు 6ర్యాంకులు, 100లోపు 48, 1,000లోపు 750 ర్యాంకులు కైవసం చేసుకొన్నారని తెలిపారు. శ్రీమతి రమానారాయణ మాట్లాడుతూ.. ఆరెండ్లల్లో ఓపెన్ క్యాటగిరీలో మూడు సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం నారాయణ విద్యాసంస్థలకే చెల్లిందని తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులుకు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.