Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి.. అధికారులకు నంద్యాల కలెక్టర్ ఆదేశం
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
Srisailam | శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్షర్ ఆలీ, సబ్‌కలెక్టర్ సాధిక్ త్రివినాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. శాఖల వారిగా సమీక్షిస్తూ, అవసరమైన ప్రతిపాదనలను సమర్పిస్తే దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
భక్తులు పాదయాత్రగా వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు
భక్తులకు చేసే ఏర్పాట్లపై 200 శాతం పకడ్బంది ప్రణాళికలు రూపొందిస్తే 100 శాతం అమలులోకి వస్తాయన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, రవాణా, భక్తులకు శీఘ్రదర్శనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే స్పందించి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే బాధితులకు స్ట్రేచ్చర్లు, అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డిఎంహెచ్ఓను ఆదేశించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళిక
క్యూలైన్లలో స్వామిఅమ్మవార్ల దర్శనార్థమై వేచివుండే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సూచించారు. తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 800 బస్సులు వచ్చే అవకాశం ఉందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్ళేందుకు సూచిక బోర్డులతో పాటు తగు సూచనలను జారీ చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు.
చెక్‌పోస్టుల వద్ద రుసుం తీసుకోవద్దు..
అటవీశాఖ పరిధిలో ఉన్న చెక్‌పోస్టులలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు ఎలాంటి రుసుం తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అమలు చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సమకూర్చాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయముతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు వుంటే సరిచేసుకోవాలని సూచించారు. ఫారెస్ట్, పోలీసు అధికారులు సహకరించి సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అన్ని శాఖలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని అధికారులను సూచించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శ్రీశైలంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై పిపిటి ద్వారా వివరించారు.
అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దాదాపు 3 వేల పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Tirupati stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
Purandeshwari | ఏపీలో బీజేపీ పగ్గాలపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందన ఇదే !
Former Minister Kakani | పోలీసులను దూషించిన వైసీపీ మాజీ మంత్రి కాకాణిపై కేసు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

