Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. అక్టోబర్ 16న విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశం
Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం కేసు విచారణ జరిగింది.
Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం కేసు విచారణ జరిగింది. విచారణకు నిందితుడు జెరుసలేం మత్తయ్య హాజరుకాగా.. రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహా, కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. అయితే, నిందితులు ఎందుకు విచారణకు రావడం లేదంటూ సెషన్స్ కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే, అక్టోబర్ 16న విచారణకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మిగతా నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను టీడీపీకి మద్దతుగా ఓటు వేయాలని డబ్బులను ఇస్తుండగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుపుతున్నది. తాజాగా ఈ కేసులో సీఎం రేవంత్‌తో పాటు నిందితులను విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

