హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మారెటింగ్ శాఖ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) ఆర్ లక్ష్మణుడిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్రాజ్కు మారెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మారెటింగ్ శాఖలో అక్రమాలు, అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మారెటింగ్ శాఖ తీరుపై సమీక్ష నిర్వహించి అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ, శాఖ తీరు మారకపోవడంతో లక్ష్మణుడిపై వేటుపడింది. అలాగే, జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న బీ రాజాగౌడ్ను నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు.