నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు సోమవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆగష్టు 2వ తేదిన వానకాలం పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 14టీఎంసీల నీటిని ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు విడుదల చేశామని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో
ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఉన్న చెరువులు, వాగులు అన్నీ అలుగు పోస్తుండడంతో అవసరాన్ని బట్టి ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నందున, ఎడమ కాల్వ కింద ఆయకట్టు సాగు కోసం నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ఎన్నెస్పీ అధికారు లు తెలిపారు.