నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 67,546 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 59,264 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 2 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 16,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులు. గరిష్ఠ నీటినిల్వ 312.0405 టీంఎసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 311.74 టీఎంసీలు.