జార్సుగూడ, జనవరి 30: హత్యకు గురైన ఒడిశా మంత్రి, బీజేడీ నేత నబ కిశోర్ దాస్ అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అంతకుముందు ఒడిశా గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సహచర మంత్రులు.. నబ కిశోర్ దాస్ మృతదేహానికి నివాళులర్పించారు. ఓ ఏఎస్ఐ ఆదివారం మంత్రిపై కాల్పులు జరపగా చికిత్స పొందుతూ ఆయన మరణించిన సంగతి తెలిసిందే.