హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజినీర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తు జరుపాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు.
వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.