e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home తెలంగాణ 2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు

2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు

2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు
  • ముమ్మరంగా ముస్కాన్‌-7

హైదరాబాద్‌, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఇంటి నుంచి తప్పిపోయిన, కర్మాగారాలు, హోటళ్లలో బాలకార్మికులుగా మగ్గుతున్న చిన్నారుల జీవితాల్లో తిరిగి నవ్వులు తెప్పించే ఉద్దేశంతో చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,174 మంది చిన్నారుల జాడను కనిపెట్టారు. ఆపరేషన్‌ ముస్కాన్‌-7లో భాగంగా తెలంగాణ పోలీసుశాఖకు చెందిన యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. చిన్నారులను అక్రమంగా నిర్బంధించిన, వారితో పనులు చేయిస్తున్న 442 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

  • 20 రోజుల్లో ముస్కాన్‌-7 ప్రగతి
  • రాష్ట్రవ్యాప్తంగా 2,174 మంది చిన్నారుల (2004 మంది బాలురు, 170 మంది బాలికల) జాడ కనిపెట్టారు.
  • రాష్ట్రం బయట మరో 361 మంది చిన్నారులను (299 బాలురు, 62 బాలికలు) రక్షించారు.
  • జాడ గుర్తించిన వారిలో 1,664 మంది (1,570 బాలురు, 94 బాలికలు) చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు.
  • 871 మంది చిన్నారులను ప్రభుత్వ హోంలకు తరలించారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు
2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు
2,174 మంది చిన్నారుల్లో చిరునవ్వు

ట్రెండింగ్‌

Advertisement