హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు 1 నుంచి 3 వరకు 18వ జాతీయ బహుభాషా నాటకోత్సవాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.
గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో కమిషనర్ పార్థసారథి ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సాంసృతిక శాఖ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమలో తెలుగు, కన్నడ, నాగ, మణిపురి, మరా ఠీ నాటకాలను ప్రదర్శించనున్నట్టు చె ప్పారు. సాయంత్రం 5:30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.