రాజన్న ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల

Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల మేరకు అంతరంగికంగానే అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉదయం ప్రాతః కాల పూజల అనితరం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారిని అందంగా అలంకరించబడ్డ పల్లకిలో, పెద్దసేవలో కూర్చుండబెట్టి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య మూడు ప్రదక్షిణలు గావించారు. ఆలయ వేదపండితులు, అర్చకుల వేద పనసలతో రాజన్న ఆలయం మారుమోగింది.

అనంతరం ఉత్సవమూర్తులతో ఉత్తర ద్వారం గుండా వెళ్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం ఆలయం ముందు భాగంలో ఆలయ వేదపండితులు, అర్చకులు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం గురించి చక్కగా భక్తులకు వివరించారు.
ఈ వేడుకల్లో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు గుండి మూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, దేవాలయానికి సంబంధించిన కొందరు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

