14 నుంచి ఎంసెట్
- 10 సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ
- నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
- వెల్లడించిన కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలని ఎంసెట్-2022 కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
రెండు గంటల ముందు నుంచే..
విద్యార్థులను 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోని అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోని అనుమతిస్తారు. బయోమెట్రిక్ క్యాప్చరింగ్‌లో భాగంగా కుడి చేతి బొటనవేలి ముద్రను తీసుకుంటారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరవడం కుదరదు.
కొద్ది నిమిషాల ముందు పాస్వర్డ్..
పరీక్ష కేంద్రంలో విద్యార్థికి కేటాయించిన కంప్యూటర్‌పై అభ్యర్థి పేరు, ఫొటో మొదలైనవి ప్రదర్శితమవుతాయి. పరీక్షకు 10-15 నిమిషాల ముందు విద్యార్థి ఐడీ, పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సైన్ఇన్ (SIGN IN) బటన్ క్లిక్‌చేసి ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేయవచ్చు. నెగెటివ్ మార్కింగ్ లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వవచ్చు.
ఏ సబ్జెక్టు కావాలంటే అదే..
విద్యార్థి ముందుగా ఏ సబ్జెక్టు (సెక్షన్)తో పరీక్షను ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టును ఎంపిచేసుకోవచ్చు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఏదీ కావాలంటే ఆయా సెక్షన్‌ను ఎంచుకోవచ్చు. కుడివైపున గల ప్యాలెట్‌లో ప్రశ్న నంబర్‌పై క్లిక్చేయగానే ప్రశ్నలు తెరపై కనిపిస్తాయి. వాటిని సమాధానాలిచ్చుకుంటూ వెళ్లాలి.
భిన్న కలర్స్‌లో..
విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని సేవ్ అండ్ నెక్ట్స్ బటన్‌ను నొక్కాలి. ఇలా చేయడంతో ప్రశ్న నంబర్ గ్రీన్కలర్లోని మారుతుంది. నిర్దేశిత సమయంలో ప్రశ్నల జవాబులను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. సమాధానం తొలగించాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ (CLEARE RESPONCE) బటన్‌పై క్లిక్ చేయాలి. సరైనది అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. రెడ్కలర్లోని ఉన్నవాటికి సమాధానాలు రాయలేదని అర్ధం. పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్ట్స్ బటన్‌పై క్లిక్చేయాలి.
సమయాన్ని ఇలా తెసుకోవచ్చు..
వాచ్‌లు, సెల్‌ఫోన్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్‌పై భాగంగా కుడివైపున టైమర్ ఉంటుంది. మిగిలి ఉన్న సమయాన్ని ఈ టైమర్ ప్రదర్శిస్తుంది. కంప్యూటర్‌పై ఐయామ్ రెడీ టూ బిగిన్ బటన్ క్లిక్చేయగానే టైమర్ ప్రారంభమవుతుంది. ఆయా సమయాన్ని బట్టి విద్యార్థులు ప్రశ్నలకు అన్సర్లు చేస్తూ ముందుకెళ్లాలి. టైమర్ జీరోకు చేరగానే పరీక్ష దానంతటదే ముగుస్తుంది.
సాంకేతిక సమస్యలు తలెత్తితే..
పరీక్ష సమయంలో లేదా మధ్యలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే టెన్షన్ పడొద్దు. మీ చేతిని పైకి ఎత్తడం ద్వారా ఈ సమస్యను ఇన్విజిలెటర్‌కు చెప్పండి. మీకు అదే పరీక్ష కేంద్రంలోని మరొక సిస్టమ్ ఇస్తారు. ఇది వరకు సిస్టమ్ అగిపోయిన లేదా.. సమస్య ఉత్పన్నమైనా అదే పాయింట్ నుంచి టైమర్ తిరిగి కొనసాగుతుంది. మీరు ఆన్సర్ చేసిన ప్రశ్నలు అలాగే ఉంటాయి. మీ సమయం ఎట్టి పరిస్థితుల్లో వృథాకాదు.
2.51 లక్షల దరఖాస్తులు..
ఎంసెట్‌కు 2,51,606 దరఖాస్తులు రాగా, నిరుటి కంటే 14,722 అధికంగా వచ్చాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల సీట్లను ఎంసెట్ ర్యాంక్‌ల ద్వారానే భర్తీచేయాలని నిర్ణయించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పరీక్షల నిర్వహణకు ఏపీ, తెలంగాణల్లో 109 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 4, ఇంజినీరింగ్‌కు 6 సెషన్లలో (మొత్తంగా 10) పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం ఎంసెట్‌ను 75 శాతం సిలబస్‌కే నిర్వహించనున్నారు. ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

