సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వాయిదా

- రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి
హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖలో ఏర్పడిన ఖాళీల భర్తీకి నిర్వహించాల్సిన ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర ప్రక్రియలను ఇప్పటికే పూర్తిచేసినప్పటికీ, ప్రజాక్షేమం దృష్ట్యా ఉప ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు. పరిస్థితులు కుదుటపడిన తరువాత వైద్యారోగ్యశాఖ అధికారులతో సంప్రదించి, ప్రభుత్వ అనుమతితో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

