హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)/నల్లగొండ సిటీ: ప్రగతి భవన్‌ను నక్సల్స్ పేల్చేయాలం టూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డి అలా అనకుండా ఉండాల్సిందని అన్నారు. ప్రగతిభవన్ ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ను కూల్చేస్తామని, గోడలు బద్దలు కొడతామని, నక్సల్స్ పేల్చేయాలంటూ అర్థం, పర్థం లేని వ్యాఖ్యలు చేయగా.. ఈయన తీరును సొంత పార్టీ నేతలే తప్పుబట్టారు. ఎంపీ కోమటిరెడ్డి బహిరంగంగా మాట్లాడగా.. మిగిలిన వారు అంతర్గత చర్చల్లో వ్యతిరేకిస్తున్నారు.