ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
తనకు బతకాలని లేదని.. తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని ఓ తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో చోటుచేసుకున్నది.
- వికారాబాద్ జిల్లా అడవివెంకటాపూర్‌లో విషాదం
కులకచర్ల, జూన్ 13 : తనకు బతకాలని లేదని.. తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని ఓ తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో చోటుచేసుకున్నది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవివెంకటాపూర్కు చెందిన నవనీత (28) శనివారం తన ఇద్దరు పిల్ల లు విగ్నేశ్(7), మధుప్రియ(5)కు ఉరివేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చా వుకు ఎవరూ కారణం కాదు. నాకు బతకాలని లేదు. అలాగని నేను లేకుండా పిల్లలు బతకడం కష్టం. అందుకే వారిని నా వెంటే తీసుకుపోతున్నా. మా చావుకు నా భర్త కా రణం కాదు. ఆయనను ఏమీ అనొద్దు. నన్ను క్షమించగలరు’ అనే సూసైడ్ నోట్ ఆ ఇంట్లో లభించినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

