Medak | హవేలిఘన్పూర్లో విషాదం.. కుమారుడి మరణం తట్టుకోలేక తల్లి మృతి
మెదక్ (Medak) జిల్లా హవేలిఘన్‌పూర్ మండలం కుచన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుమారుడి మరణవార్త తట్టుకోలేక తల్లి మరణించారు.
మెదక్: మెదక్ (Medak) జిల్లా హవేలిఘన్‌పూర్ మండలం కుచన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుమారుడి మరణవార్త తట్టుకోలేక తల్లి మరణించారు. గ్రామానికి చెందిన నరసింహగౌడ్ (36) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చనిపోయారు.
విషయం తెలుసుకున్న అతని లక్ష్మి (57) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. నరసింహగౌడ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, గంట వ్యవధిలోనే తల్లీకొడుకుల మృతితో కుచన్‌పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

