Engineering Seats | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): బీటెక్‌లో మరో 10వేలకు పైగా సీట్లు పెరగనున్నాయి. 7 -8 వేల వరకు సీట్ల కన్వర్షన్‌కు అనుమతినిచ్చినవి ఉండగా, మరికొన్ని సీట్ల పెంపునకు సంబంధించినవి ఉన్నాయి. ఆయా సీట్లకు సోమవారం ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఎప్‌సెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు గడువును 17 వరకు పొడగించారు. వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరైన వారంతా వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. సోమవారం వరకు 93,167 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నట్టు శ్రీదేవసేన తెలిపారు.
డీఎస్సీ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
వారంలో బీటెక్ ఫీజుల పెంపునకు నోటిఫికేషన్!
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): 2025-26, 2026-27, 2027-28 సంవత్సరాల ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) వారంలో నోటిఫికేషన్ జారీచేయనుంది. ఇప్పుడు అడ్మిషన్లు పొందేవారికి పాత ఫీజులే వర్తించనుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అక్టోబర్ 30 వరకు కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించేందుకు అవకాశమిచ్చి, నవంబర్, డిసెంబర్లో కాలేజీలను ప్రత్యక్ష విచారణకు పిలుస్తారు. ఇంజినీరింగ్‌తోపాటు ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బయోటెక్నాలజీ ఫీజులను సై తం పెంచుతారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డి, ఓయూ, జే ఎన్టీయూ రిజిస్ట్రార్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్రావు, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి వెంకటేశ్ హాజరై చర్చించారు.