కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్
హైదరాబాద్ : కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది. నిన్న ఫీవర్ ఆస్పత్రిలో చేరిన యువకుడి నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి.. పుణె ల్యాబ్‌కు పంపినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వచ్చిన ఆ యువకుడు తీవ్ర నీరసానికి గురయ్యాడు. జ్వరంతో బాధపడ్డాడు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో నోడల్ కేంద్రంగా ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కు వచ్చాడని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. మొత్తంగా బాధిత యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధారణ కావడంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మంకీపాక్స్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

