ఆకులు రాలి, అనేక చెట్లు మోడువారగా, మోదుగ చెట్లు(Modugu poolu) మాత్రం నిండుగా పూలతో కనువిందు చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు(Madhuru), ధూళిమిట్ట మండలాల్లోని పొలం గట్లపై ఉన్న మోదుగ చెట్లు గుత్తులు గుత్తులుగా పూలతో గుబాళిస్తు న్నాయి. ఈ మోదుగ పూలను గోగుపూలు, అగ్గిపూలు, ఎర్రని పూలగా గ్రామాలలో పిలు స్తుంటారు. శివరాత్రికి ముందు పూచేటువంటి ఈ మోదుగ పూలు శివునికి అత్యంత ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో హోళీ పండుగకు పిల్లలు మోదుగ పువ్వును ఉడక బెట్టి రంగు తయారు చేసి ఒకరిపై ఒకరూ చల్లుకుంటారు. మోదుగ పూలలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.
-మద్దూరు(ధూళిమిట్ట)