కేసీఆర్ పాలనతో మోదీ వెన్నులో వణుకు
- తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం
- విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ వెన్నులో వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. తమ ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదివారం నల్లగొండలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ వంటి సంక్షేమ పథకాలను పక్క రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రజలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లేదంటే సరిహద్దు ప్రాంతాలను తెలంగాణలో కలుపాలనే డిమాండ్ వస్తున్నదని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనకు వస్తున్న గుర్తింపును తట్టుకోలేకనే ప్రధాని మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. మోదీ పాలనపై విసుగు చెంది ప్రాంతీయ పార్టీల సీఎంలు బీజేపీ భరతం పట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ముంబై వెళ్లినట్టు తెలిపారు. పాలనలో మోదీ విఫలమయ్యాడని, ఏదో ఒకటి చేయాలని ఇతర రాష్ర్టాల నుంచి సీఎం కేసీఆర్‌కు ఫోన్లు వస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

