MLC Kavitha | రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై మండలిలో ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్‌రావు
MLC Kavitha | రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి(Legislative Council ) లో తీర్మాణాలను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ : రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి (Legislative Council
) లో తీర్మానాలను ప్రవేశపెట్టారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mla Kavitha) మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) మరో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారన్నారు.
రైతులకు రూ. 19వేల కోట్ల రుణాలను మాఫీచేస్తామని ప్రకటించి గురువారం నుంచే రుణాలను మాఫీ చేయడం ప్రారంభించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. టీఎస్ ఆర్టీసీ సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని వెల్లడించారు. సంస్థ పరిరక్షణతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

