CM Revanth | చిక్కుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..! శాసనమండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మండలి సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీతో విచారణ విచారణ జరిపించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీలు కోరారు.
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మండలి సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీతో విచారణ జరిపించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్‌రావు, సురభి వాణీదేవి, దేశపతి శ్రీనివాస్ శాసనమండలి చైర్మన్‌ను ఛాంబర్లో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి శాసనమండలిని ఇరానీ కేఫ్ అని, అందులో ఉన్నవాళ్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్సీలు తీవ్రంగా పరిగణించారు.
కళలు, సాహిత్య, విద్య, వైద్య, సామాజిక, సేవా రంగాలకు చెందిన ప్రముఖులతో భాసిల్లుతూ రాష్ట్ర ఎగువసభగా, పెద్దల సభగా పిలుచుకునే శాసనమండలిని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎంఎస్ ప్రభాకర్‌రావు, ప్రజాకళాకారులు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ ఎంతోమంది నిష్ణాతులున్న శాసనమండలిని ఇరానీ కేఫ్‌తో పోల్చి సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలిని తీవ్రంగా అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి తగు చర్య తీసుకోవాలని ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్‌ను కోరారు.
ఈనెల 7న ఓ టీవీ ఛానెల్లో బిగ్ డిబేట్ పేరుతో నిర్వహించిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలిపై వ్యాఖ్యానించారు. ‘నేను మొన్న శాసనమండలికి వెళ్లాను. వెళ్లి కూర్చుంటే ఇరానీ హోటల్‌కు వెళ్లినట్టు.. కాఫీ హోటల్‌కు వెళ్లినట్టు అనిపించింది. చుట్టూ చూస్తే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూర్చున్నట్టే ఉంది’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సదరు టీవీ ఛానెల్లో చేసిన బిగ్ డిబేట్ మొత్తం సదరు మీడియాలో అదృశ్యం కావడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

