నేడు చెన్నై వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతారు.
బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతతోపాటు తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టనున్నారు. కాగా, ముందుగా నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

