MLC Kavitha | వరద బాధిత ప్రజలకు అండగా నిలవాలి .. అధికారులకు ఎమ్మెల్సీ కవిత సూచన
MLC Kavitha | నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు. శనివారం ఆమె జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను (Flood Effect Areas) పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ, సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని కోరారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు (SRSP) నుంచి నీటి విడుదల, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు, సహాయక చర్యలు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.
వైద్యం (Medical ), ఆహారం (Food), విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ తోపాటు తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి అధికారులు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని, అత్యవసరంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

