MLC Kavitha | 60 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ మహిళలకు చేసిందేమిటి? : ఎమ్మెల్సీ కవిత ఫైర్
MLC Kavitha | 60 ఏండ్ల తమ పాలనలో అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు (Reservations for women) కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : 60 ఏండ్ల తమ పాలనలో అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు (Reservations for women) కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్ఠానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చిందన్నారు.
తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం అన్నారు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన అన్నారు..
రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్ధితో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

