MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఈ జాతులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కోల శ్రీనివాస్ మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సంచార జాతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సంచార జాతుల అభివృద్ధికి కృషి జరిగిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయా పథకాల ప్రయోజనాలు అందడం లేదని, దాంతో వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డీనోటిఫైడ్ జాతుల ఆర్థిక సాధికారత పథకం (సీడ్) కింద ప్రయోజనాలు సంచార జాతులు కోల్పోతున్నారని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డీఎన్టీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఎత్తరి మారయ్య, ఆలకుంట్ల హరి, ఆర్వి మహేందర్ రాజమళ్ళ బాలకృష్ణ, డి నరేష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, డి కుమారస్వామి ప్రవీణ్ వంజరా, గోపు సదానందం, శ్రీధర్ సాగర్, లంగం పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

