MLC Kavitha | అధికారంలోకి వచ్చినా అబద్ధాలు వీడని కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్ ఒక్కసారి కూడా చెయ్యెత్తి జై తెలంగాణ అనలేదని విమర్శించారు. సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని సీఎం అంటున్నారని, తానూ తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. అయినా తెలంగాణ తల్లి విగ్రహం గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం ఏంటన్నారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై త్వరలో గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. మాజీ డీజీపీపై జ్యుడిషియల్ విచారణ జరపాలన్నారు. మహేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గతంలో దుర్భాషలాడారని గుర్తుచేశారు. టీఎస్పీఎస్సీలో ఆంధ్రా వ్యక్తిని సభ్యుడిగా నియమించారని ఆరోపించారు. రాజకీయ నేపథ్యం ఉన్న పాల్వాయి రజనిని మెంబర్‌గా ఎలా నియమిస్తారన్నారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. విద్యుత్ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్లను డైరెక్టర్లుగా నియమించారని విమర్శించారు. చంద్రబాబు డైరక్షన్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్లుందని ఆరోపించారు. అర్హత లేని వ్యక్తులను సలహాదారులుగా నియమించారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తరఫున ఓటుకు నోటు కేసును వాదించిన లాయర్లకు ప్రభుత్వం తరఫున జీతాలిస్తున్నారని చెప్పారు.
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలిచ్చామని చెప్పారు. జీఎం స్థాయిలో చేయాల్సిన పనిని సీఎం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా 400 ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని వెల్లడించారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించిందని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో సింగరేణి ఉద్యోగాల్లో కోత విధించారని గుర్తుచేశారు.
సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క గార్లు చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM Revanth Reddy
- Congress
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

