MLC Kavitha | సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కుట్రల నుంచి సింగరేణిని సీఎం కేసీఆర్ తప్పించారని అన్నారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి సింగరేణి సంస్థను కాపాడారని తెలిపారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను రాష్ట్ర విభజన అనంతరం సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు.
తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని అన్నారు. అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని వివరించారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వం ఉద్యోగాలను కల్పించారని చెప్పారు. అదే రకంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని అన్నారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

